ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ

Update: 2019-11-20 12:02 GMT
అశ్వత్ధామరెడ్డి

ఆర్టీసీ సమ్మెపై జేఏపీ వెనక్కితగ్గింది. విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ప్రకటించింది. అయితే బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్ధామరెడ్డి. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

ఇక ప్రభుత్వం ప్రకటన చేసినా, ఆహ్వానించిన చర్చలకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఎలాంటి షరతులపై కార్మికులు సంతకాలు చేయరని, విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్నారు.

హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నట్టు చెప్పారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వం కూడా కోర్టు తీర్పును గౌరవించాలని, లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు అశ్వత్థామరెడ్డి.

Full View




Tags:    

Similar News