పోలీస్ లాఠీచార్జ్ లో రాజాసింగ్ కు గాయాలు...

Update: 2019-06-20 03:27 GMT

హైదరాబాద్‌లోని జుమ్మెరాత్‌ బజార్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జుమ్మెరాత్ బజార్‌లో అవంతిభాయ్‌ విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో... అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులపై దాడి చేశారు.. ఈ సమయంలో అక్కడే ఉన్న గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలపై కూడా పోలీసులు దాడి చేశారు.. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజాసింగ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..

రాణి అవంతి బాయ్ విగ్రహంలో కొన్ని లోపాలు ఉండడం వల్ల.. దానిని అక్కడ నుంచి తరలిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు.. అయితే పోలీసులు ఎలాంటి కారణాలు లేకుండా తమపై దాడి చేశారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.. 2009లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఇప్పటి వరకూ రెండు సార్లు మరమ్మతులు చేశామని.. కానీ ఎప్పుడూ ఇలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదని తెలిపారు.. ఈ సారి పోలీసు హద్దులు దాటడం దారుణమన్నారు.

రాజాసింగ్ మరియు అతని అనుచరులపై దాడి చేసిన శాహినాయత్ గాంజ్ ఏసిపి నరేందర్ రెడ్డి, ఆసిఫ్ గవర్నర్ ఏసీపి నర్సింహా రెడ్డి, శాహినయత్ గూంజ్ ఎస్ గురుమూర్తి.. మరియు ఎస్పీ రవికుమార్ లపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై కాసేపట్లో డీజీపీకి ఫిర్యాదు చేయనున్నరు.  

Full View

Similar News