Revanth Reddy: భారత పౌరుడిగా ఎంతో గర్వంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
Revanth Reddy: భారత పౌరుడిగా ఎంతో గర్వంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
Revanth Reddy: పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల భారత పౌరుడిగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయం ఇదంటూ జైహింద్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ కు రావాలని సూచించారు.