CM Revanth Reddy: రెండోసారి నేనే ముఖ్యమంత్రి..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని ..రెండోసారి తానే ముఖ్యమంత్రి అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు.
Revanth Reddy: భారత పౌరుడిగా ఎంతో గర్వంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని ..రెండోసారి తానే ముఖ్యమంత్రి అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి సమావేశాల తర్వాత శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులు, సంక్షేమ పథకాల అమలు భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆయన వివరించారు. ప్రజలు తమపై నమ్మకంతోనే ఓటు వేస్తారని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం ద్వారా ప్రజల్లో మరింత మద్దతు సంపాదించుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మొదటిసారి ప్రజలు బీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఓటు వేశారు..ఇప్పుడు మాపై నమ్మకంతోనే మళ్లీ ఓటు వేస్తారని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ప్రతి హామీని అమలు చేసి సంక్షేమ పథకాల లబ్దిదారులే మా ఓటర్లుగా మారేలా చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో స్పష్టతతో ఓటింగ్ చేశారు. 2014లో బీఆర్ఎస్ ను నమ్మి అవకాశం ఇచ్చారు. కానీ పాలనలో వాళ్లు విఫలమయ్యారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా లక్ష్యమన్నారు.
నేను పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా..ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా..వ్యక్తిగత ఎదుగుదల కాదు..రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యం అన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువతకు మరింత మేలు చేకూర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మేము గెలిచిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని తెలిపిన రేవంత్ రెడ్డి..వచ్చే ఆర్థిక సంవత్సరానికి వందశాతం బకాయిలను చెల్లిస్తామని తెలిపారు.