HYDRA Demolition: కబ్జాదారుడి ఆటకట్టించిన హైడ్రా.. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసుల హర్షం
HYDRA Demolition: రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన ఓ కబ్జాకోరు ఆటకట్టించింది.
HYDRA Demolition: కబ్జాదారుడి ఆటకట్టించిన హైడ్రా.. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసుల హర్షం
HYDRA Demolition: రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన ఓ కబ్జాకోరు ఆటకట్టించింది. కబ్జా కోరులకు చెంపపెట్టు లాంటి చర్యలు చేపట్టి మరోసారి ప్రజల నుంచి మన్ననలు పొందింది హైడ్రా. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలోనీ 700 గజాల పార్క్ స్థలాన్ని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేశాడు.
అయితే.. ఆ కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపించారు. అనేక సార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో తాజాగా కాలనీ వాసులు భూ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. దాంతో సమగ్ర విచారణ అనంతరం కబ్జా జరిగింది వాస్తవమేననీ హైడ్రా అధికారులు ధృవీకరించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పారు. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.