శభాష్ అనిపించుకున్న ట్రాఫిక్ పోలీస్ నాగమల్లు

Update: 2019-08-31 08:49 GMT

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అద్ధం పడుతున్నారు హైదరాబాద్‌లోని కొందరు పోలీసులు. విధులు నిజాయితీగా నిర్వహించడమే కాదు అవసరమైనప్పుడు తమ మానవత్వాన్ని సైతం చాటుకుంటున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే సహాయం చేయడానికి తెలిసిన వారే ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇక రోడ్డుపై ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు ఉంటుంది. ఎవరికి ఏమైతే నాకేంటి అన్నట్టు ఉంటారు. కాని హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహిస్తూనే మానవత్వాన్ని చాటుకున్నాడు.

అది ఎల్బీనగర్‌లోని సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతం. సమయం సాయంత్రం 4 గంటలు అవుతోంది. భారీగా కురిసిన వర్షంతో ఆ ప్రాంతం నీటితో నిండిపోయింది. వాహనాలు వెళ్లలేని పరిస్థితి. అక్కడ ఉన్న నాగమల్లు అనే ట్రాఫిక్ పోలీసు నిలిచిపోయిన వర్షం నీరు దిగువకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అదే మార్గంలో ఓ వ్యక్తి కాలుకి దెబ్బతగిలిన తన తండ్రిని హాస్పటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు. అయితే రోడ్డుపై నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లి బండి ఆగిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ నాగమల్లు ఈ విషయాన్ని గమనించారు వెంటనే పేషెంట్ కాలు నీటిలో తడవకుండా అతని కాలుకు ఓ కవర్ కట్టి తన బుజాలమీద ఆ వ్యక్తిని మొసుకెళ్లి ఒడ్డుకు చేర్చాడు.

ఈ మొత్తం విషయాన్ని అక్కడ ఉన్న కొందరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. విధులు నిజాయితీగా నిర్వహించడమే కాదు ప్రజలకు ఏదైనా అవసరమైనప్పుడు సహాయ పడటమే ఫ్రెండ్లీ పోలీసింగ్. దానికి అద్దం పట్టాడు ట్రాఫిక్ పోలీస్ నాగమల్లు. అతడు చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News