Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం తీవ్ర కలకలం రేపింది.

Update: 2025-12-06 06:08 GMT

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న రెండు విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కువైట్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న KU-373 విమానంలో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మెయిల్‌ వచ్చింది. దీంతో.. విమానాన్ని మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌కు దారి మ‌ళ్లించారు అధికారులు.

అలాగే.. లండన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న బ్రిటీష్‌ ఎయిర్‌ లైన్స్‌ BA-277 విమానానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. అయితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేసిన ఫైలట్‌.. ప్రయాణికులను దించేసి ఐసోలేషన్‌కు తరలించాడు. సమాచారం అందుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌.. రంగంలోకి దిగి విమానంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.

Tags:    

Similar News