Hyderabad: బ్రిలియంట్ కాలేజీలో భారీ చోరీ

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌‎మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ చోరీ చోటుచేసుకుంది.

Update: 2025-10-10 07:52 GMT

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌‎మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ చోరీ చోటుచేసుకుంది. కాలేజ్‌లోని సేఫ్‌లాకర్స్ బ్రేక్ చేసి 3కాలేజీలకు సంబందించిన కోటి రూపాయల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బ్రిలియంట్ కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఒక్కరే డబ్బులు దోచుకుని పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 200 సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్‌ను ఎత్తుకెళ్లి క్లూస్ చిక్కకుండా దుండగులు జాగ్రత్త పడ్డారని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.    

Tags:    

Similar News