Hyderabad: నగరంలో ఐటీ దాడుల కలకలం.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి.
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హోటల్ ఓనర్ హర్షద్ అలీఖాన్‌ను విచారించారు. గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు.
ఇటీవలే ప్రముఖ హోటల్స్ యజమానులను విచారించారు ఐటీ అధికారులు. మెహఫిల్, పిస్తా హౌస్, షా గౌస్ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు, డాక్యుమెంట్లను గుర్తించారు అధికారులు. వీరితో లింక్స్ ఉన్న హోటళ్లపై సైతం ఫోకస్ పెట్టిన ఐటీ అధికారులు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు.