Drugs Party: రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో యువకుడు మృతి
Drugs Party: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది.
Drugs Party: రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో యువకుడు మృతి
Drugs Party: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా శివరాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అహ్మద్ అలీ తన స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు కలిసి నివసిస్తున్నారు. అయితే గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకునేలోపే అహ్మద్ అలీ మృతి చెందాడు.
గత రాత్రి అహ్మద్ అలీ సహా ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్‌తో అహ్మద్ అలీ మృతి చెందినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.