ప్రగతి భవన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం..అదుపులోకి తీసుకున్న పోలీసులు

లాక్ డౌన్ కారణంగా కూలీ పనులు చేసుకునే వారు, చిరువ్యాపారాలు, పేద కుటుంబీకులు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Update: 2020-05-17 12:26 GMT

లాక్ డౌన్ కారణంగా కూలీ పనులు చేసుకునే వారు, చిరువ్యాపారాలు, పేద కుటుంబీకులు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారు లాక్ డౌన్ లో వ్యాపారాలు నడవకపోవడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు. కుటుంబాన్ని పోషించలేక మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ చిరువ్యాపారి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా అక్కడ ఉన్న సిబ్బంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఉండడంతో అతడిపై నీటిని కుమ్మరించారు. అతను ఒంటికి నిప్పంటించుకోకుండా అడ్డుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులు విచారించారు.

కాగా సదరు వ్యక్తి చెప్పిన పూర్తివివరాల్లోకెళ్తే మలక్ పేట్‌కు చెందిన మహ్మద్ నజీరుద్దీన్‌ చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపాడు. ఉన్నట్టుంది ఒక్క సారిగా కరోనా వైరస్ విజృంభించడంతో దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేసాయని. దీంతో గత రెండు నెలలుగా అతని వ్యాపారం పూర్తిగా మూతపడిందని తెలిపాడు. చేసుకోవడానికి ఏ పని దొరకకపోవడంతో కుటుంబ పోషన్ భారమైందని అతనే తన గోడును వెల్లగక్కాడు. ఆదాయం లేక కుటుంబాన్ని పస్తులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందాడు. దీంతో అతను దిక్కు తోచని పరిస్థితిలో ఈ పనిచేసానని ప్రభుత్వం తన లాంటి చిరు వ్యాపారులకు ఆదుకోవాలని నజిరుద్దీన్ కోరాడు. తన పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రగతి భవన్ ప్రధాన ద్వారం వద్ద ఈ ఘటన జరగ్గా అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతణ్ని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News