Charminar Clock: చార్మినార్ గడియారం డయల్ బోర్డు ఎలా డ్యామేజీ అయింది: దీని చరిత్ర ఏంటి?

Charminar Clock: చార్మినార్ గడియారం డయల్ బోర్డు స్వల్పంగా డ్యామేజీ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు రిపేర్లు ప్రారంభించారు.

Update: 2024-07-31 07:17 GMT

Charminar Clock: చార్మినార్ గడియారం డయల్ బోర్డు ఎలా డ్యామేజీ అయింది: దీని చరిత్ర ఏంటి?

Charminar Clock: చార్మినార్ గడియారం డయల్ బోర్డు స్వల్పంగా డ్యామేజీ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు రిపేర్లు ప్రారంభించారు. ఇది ఎందుకు దెబ్బతిందనే విషయమై విచారణ ప్రారంభమైంది.

చార్మినార్ గడియారం ఎలా డ్యామేజీ అయింది?

చార్మినార్ కు కెమికల్ ట్రీట్ మెంట్ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇనుప పైపు తగిలి డయల్ బోర్డు దెబ్బతిందని చెబుతున్నారు. పావురాలతో ఈ డ్యామేజీ అయిందని మరికొందరి వాదనగా ఉంది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అధికారులు విచారణను ప్రారంభించారు.

లండన్ నుంచి తెప్పించిన గడియారాలు

కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదో పాలకులు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. ప్లేగ్ వ్యాధిని సమర్ధవంతంగా నిర్మూలించినందుకు గుర్తుగా చార్మినార్ ను నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. హైద్రాబాద్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చార్మినార్. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడం చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తుంటారు. చార్మినార్ కు నాలుగు వైపులా నాలుగు గడియారాలను 1889లో అమర్చారు. అప్పట్లోనే లండన్ నుంచి ఈ గడియారాలను తెప్పించారు. వాహిద్ వాచ్ కంపెనీ ఈ గడియారాలను తయారు చేసింది.

ఈ వాచ్ లు ఎలా పనిచేస్తాయి?

135 ఏళ్ల క్రితం చార్మినార్ కు అమర్చిన నాలుగు గడియారాలు ఇంకా పనిచేస్తున్నాయి. 24 గంటలకు ఓ సారి వీటికి కీ ఇస్తే సరిపోతుంది. చార్మినార్ కు సమీపంలోని వాచ్ రిపేర్ నిర్వహించే మధు ప్రతి రోజూ ఈ నాలుగు గడియారాలకు కీ ఇస్తారు. ఈ నెల 29న కూడా ఆయన వాచ్ లకు కీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ వాచ్ లు ధ్వంసమైన విషయాన్ని కొందరు సిబ్బంది గుర్తించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్కియాలజీ అధికారులు వెంటనే దెబ్బతిన్న గడియారం డయల్ బోర్డు రిపేర్ పనులను ప్రారంభించారు. డయల్ బోర్డు దెబ్బతిన్నప్పటికి అది పనిచేస్తుందని అధికారులు తెలిపారు.

హైద్రాబాద్ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే చార్మినార్ ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News