Hyderabad: సనత్ నగర్‌లో దారుణం.. అమావాస్య రోజున బాలుడిని బలిచ్చిన హిజ్రా?
Hyderabad: నాలాలో బాలుడి మృతదేహం గుర్తింపు
Hyderabad: సనత్ నగర్‌లో దారుణం.. అమావాస్య రోజున బాలుడిని బలిచ్చిన హిజ్రా?
Hyderabad: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఎనిమిదేండ్ల వయస్సున్న అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం సనత్‌నగర్‌లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. అమావాస్య కావడంతో బాలుడిని నరబలి ఇచ్చారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఉంటున్న హిజ్రా.. బాలుడిని నరబలి ఇచ్చాడని ఆరోపిస్తూ అతని ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ వయస్సు ఎమినిదేళ్లు. గురువారం సాయంత్రం తప్పిపోయాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. హిజ్రా ఇంట్లో కనిపించిన క్షుద్రపూజల ఆనవాళ్లతో తనే బాలుడిని హత్య చేసిందని ఆరోపణలు వస్తున్నాయి.
రోజురోజుకు సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతుంది. ఇలాంటి కాలంలోనూ ఇంకా మూఢనమ్మకాలు ప్రజలు వీడడం లేదు. క్షుద్రపూజలు, నరబలులు చేస్తే మంచి జరుగుతుందని భావించి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఓ 8 ఏళ్ల బాలుడి మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతి చెందిన బాలుడు అబ్దుల్ వహీద్ గా పోలీసులు గుర్తించారు. బాలుడిని ఓ హిజ్రా బలి ఇచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో మూఢనమ్మకాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. ఇంట్లో బాగోలేదని..ఒంట్లో బాగోలేదని కొంతమంది చేతబడి చేసే వాళ్లను కలుస్తున్న ప్రజలను వారు చెప్పింది గుడ్డిగా ఆచరిస్తున్నారు. అసలేం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించకుండా..ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని సనత్ నగర్ లో 8 ఏళ్ల బాలుడి మృతిపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. నిన్న అమావాస్యతో పాటు గురువారం కావడం బాలుడిని నరబలి ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అమావాస్య వేళ ఓ హిజ్రా బాలుడిని నరబలి ఇచ్చి అనంతరం ఓ నాలాలో మృతదేహాన్ని పడేసినట్లు చెబుతున్నారు.