Khammam: వర్ష బీభత్సం.. ఇంటిగోడ కూలి భార్యాభర్తలు మృతి

Khammam: గత రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు

Update: 2023-12-06 06:29 GMT

Khammam: వర్ష బీభత్సం.. ఇంటిగోడ కూలి భార్యాభర్తలు మృతి

Khammam: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో విషాదం చోటు చేసుకుంది.ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలి నిద్రిస్తున్న భార్యాభర్తలపై పడింది. గోడ కూలిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే భార్యాభర్తలు మృతి చెందారు. ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News