Chess Champion: చెస్‌లో సత్తా చాటుతున్న ఖమ్మం జిల్లా చిన్నారి

Chess Champion: పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారిని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.

Update: 2021-04-13 10:24 GMT

Chess Champion: చెస్‌లో సత్తా చాటుతున్న ఖమ్మం జిల్లా చిన్నారి

Chess Champion: పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారిని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చిన్న వయస్సులోనే చెస్ గేమ్ లో తన కంటే పెద్దవారితో పోటీపడి చెక్ అవుట్ చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. విజయమే లక్ష్యంగా దూసుకెళ్లుతున్న లిటిల్ చెస్ ఛాంపియన్ శ్రీహర్షితపై hmtv స్పెషల్ స్టోరీ.

చెస్ లో ఎన్నో అవార్డులు సాధించిన ఈ చిన్నారి కళ్లకు గంతలు గట్టుకుని ఆడడంలో కూడా దిట్ట. ఖమ్మం జిల్లా బోనకల్లు గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉండే లగడపాటి రవి, స్వప్న దంపతుల ఏకైక కూతురు శ్రీ హర్షిత. తండ్రితో చెస్ పై ఇష్టం పెంచుకుంది. భద్రాచలంలో కోచ్ క్రాంతి కుమార్ వద్ద శిక్షణ ఇప్పించగా కేవలం మూడు నెలల్లోనే చెస్ ఆటపై పట్టు సాధించింది శ్రీహర్షిత.

ఏడేళ్ల వయసులోనే అండర్ 19 రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో నాలుగో స్థానం దక్కించుకుని శ్రీహర్షిత సత్తా చాటింది. 2017 ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ లో జరిగిన జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. సూర్యాపేటలో జరిగిన ఓపెన్ టోర్నమెంట్లో తన కన్నా పెద్ద వయసు వారితో పోటీపడి మొదటి స్థానంలో నిలిచింది. వరంగల్లో జరిగిన పాఠశాల రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. ఒక టోర్నమెంట్ లో బైక్ గిఫ్ట్ గా వచ్చింది. చెస్ లో గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యం మంటున్న శ్రీహర్షిత ప్రభుత్వం చేయూత అందించాలని కోరుతుంది.

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో శ్రీహర్షిత ప్రైజ్ లు గెలుచుకుంది. కళ్లకు గంతలు గట్టుకుని కూడా ఆడుతుంది. ప్రత్యర్థిని చెక్ అవుట్ చేస్తోంది. శ్రీహర్షిత ప్రతిభను మెచ్చుకుని హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా గ్రుప్ 2017లో అవార్డులు అందజేసింది. శ్రీహర్షిత విజయాలపై ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంకరేజ్ కు ప్రభుత్వం తోడైతే రాష్ట్రానికి, దేశానికి శ్రీహర్షిత పేరు తీసుకువస్తుందని చెబుతున్నారు. శ్రీహర్షిత తమకు ఎంతో స్ఫూర్తి నిస్తోందని ఆమె ఫ్రెండ్స్ అంటున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లుతున్న శ్రీహర్షిత తన లక్ష్యం సాధించాలని కోరుకుంటూ హెచ్ ఎం టీవీ ఆల్ ది బెస్ట్ చెబుతోంది. 

Full View


Tags:    

Similar News