Coronavirus Panic in Telangana: కరోనా భయంతో పల్లెలకు పోతున్న జనం

Update: 2020-06-29 06:47 GMT

Coronavirus Panic in Telangana: కరోనా కాటుకు పట్టణాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. హాట్‌జోన్లని, రెడ్‌జోన్లని బెదరగొడుతుంటే ఏం చేయాలో తెలియక జనాలు భయంతో బతుకుతున్నారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎన్ని వసతులు ఉన్నా ఎన్ని సౌలభ్యాలు ఉన్నా పట్టణాల కంటే పల్లెలే బెటర్‌ అంటూ ఊళ్లబాట పడుతున్నారు. కరోనా ప్రకోపానికి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు.

మహమ్మారి దెబ్బకు వ్యవస్థలు అవస్థలు పడుతుంటే సగటు సామాన్య పౌరుడి జీవనం కూడా కష్టాలపాలవుతోంది. బడా బడా మాల్స్‌ నుంచి చిరువ్యాపారుల వరకు, హోటళ్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. అందుకే ప్రజలందరూ నగరం విడిచి గ్రామాల బాటపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన టులెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇంటి అద్దెలు తక్కువకు ఇస్తామన్నా ఉండడానికి ఎవరు ముందుకు రావడం లేదు.

సుదీర్ఘ లాక్‌డౌన్‌ వల్ల నగరంలో పనులు లేక ప్రజలు పల్లెబాట పట్టారు. దానికి తోడు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోన కేసులు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో నెట్టుకొచ్చే బదులు సొంతూర్లలో ఏదో ఒక పని చేసుకునైనా బతకొచ్చని మూటముళ్లె సర్దుకొని ఊళ్లకు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా మారిపోయింది. ఏ కాలనీలో చూసినా టు-లెట్ బోర్టులే దర్శనమిస్తున్నాయి. 

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Full View


Tags:    

Similar News