Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులతో విద్యార్థుల ఇబ్బందులు. స్పందించిన అధికార యంత్రాంగం
ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులతో విద్యార్థులు పడుతున్న అవస్థలపై హెచ్ఎంటీవీ కథనంతో అధికార యంత్రాంగం కదిలింది. విద్యార్థుల సమస్యలపై వరంగంల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పందించారు. క్రిస్టియన్ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పిల్లలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను హెచ్ఎంటీవీ తన దృష్టికి తీసుకు వచ్చిందన్నారు. వారం రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.