ఆర్టీసీ సమ్మె విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2019-11-18 12:47 GMT
‍హైదరాబాద్ హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై విచారణలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయని, వాటిని దాటి ముందుకు వెళ్లలేమని స్పష్టం చేసింది. సమ్మెపై తాము ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలంటూ కార్మికశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ విషయాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని, రెండు వారాల్లోగా సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కమిషనర్‌ను ఆదేశించినట్లు వివరించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందని ప్రకాశ్ రెడ్డి వాదించారు.

Full View



Tags:    

Similar News