Narayanpet: బ్రిడ్జిపై ఇరుక్కుపోయిన రెండు వాహనాలు.. రెండు గంటల పాటు నిలిచిపోయిన రాకపోకలు
Narayanpet: కట్టర్ల సహాయంతో వాహనాలను విడగొట్టి ట్రాఫిక్ క్లియర్..
Narayanpet: బ్రిడ్జిపై ఇరుక్కుపోయిన రెండు వాహనాలు.. రెండు గంటల పాటు నిలిచిపోయిన రాకపోకలు
Narayanpet: నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గల కృష్ణానది బ్రిడ్జిపై రెండు భారీ వాహనాలు ఇరుక్కుపోవడంతో రవాణా స్థంభించింది. బ్రిడ్జిపై ఎదురు ఎదురుగా వచ్చిన రెండు వాహనాలు ఇరుక్కుపోవడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు రెండుగంటల ట్రాఫిక్‌లో ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు గ్యాస్ కట్టర్ల సహాయంతో రెండు వాహనాలను విడగొట్టిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.