Lockdown in Telangana: వైన్ షాపుల వద్ద భారీ క్యూ

Lockdown in Telangana: బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులోకి రానుంది.

Update: 2021-05-11 11:24 GMT

Lockdown in Telangana: వైన్ షాపుల వద్ద భారీ క్యూ

Lockdown in Telangana: బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులోకి రానుంది. ఈ సమయంలో వైన్ షాపులు కూడా మూతపడతాయని భావించిని వినియోగదారులు.. వైన్ షాపుల వద్ద ఎగబడతున్నారు. నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఏ వైన్ షాపు ముందు చూసినా మందుబాబుల రద్దీ కనిపించింది.

హైదరాబాదులోని వైన్ షాపుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఈ క్యూలు కిలోమీటర్ల మేర ఉన్నాయంటే మందుబాబుల ముందుజాగ్రత్త ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కేసుల కొద్దీ మద్యం, బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. అయితే, మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం నిబంధన అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.

Tags:    

Similar News