భారీ వర్షం దెబ్బకి మెట్రో రైళ్లూ మొరాయించాయి

భారీ వర్షం హైదరాబాద్ ను అతలాకుతం చేసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ భారీగా స్థంబించింది. దీంతో ప్రజలు మెట్రో ను ఆశ్రయించారు. ఈక్రమంలో మెట్రో రైళ్ళు కూడా మొరాయించాయి. ప్రస్తుతం ప్రజలు ఇళ్ళకు చేరడానికి నానా అవస్థలూ పడుతున్నారు.

Update: 2019-09-25 17:00 GMT

కుండపోత వాన.. రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థతి. ట్రాఫిక్ జాం. రోడ్డు మార్గంలో కదలలేని స్థితి. సహజంగానే ప్రజలంతా మెట్రో రైలును ఆశ్రయించారు. దాంతో మెట్రో కిక్కిరిసిపోయింది. మెట్రో రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. మెట్రో స్టేషన్ లన్నీ ప్రయాణీకులతో కిటకిట లాడాయి. దీంతో మెట్రో పరిస్థితి కూడా అదుపుతప్పి పోయింది.

ముఖ్యంగా ఎల్బీ నగర్-అమీర్ పేట, మియాపూర్ రూట్లలో మెట్రో సర్వీసులకు తీవ్ర అంతరాయం జరిగింది. గంటకు పైగా రైళ్లన్నీ నిలిచిపోయాయి. దీంతో స్టేషన్లు కూడా ఖాళీ లేనంతగా నిండిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షం కారణంగా మెట్రో రైల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న నేపథ్యంలో రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు మెట్రో రైళ్లు ఎక్కడానికి, దిగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వివరించారు.


Tags:    

Similar News