Harish Rao: రేవంత్ అంటే వెన్నుపోటు.. రేవంత్ అంటే ద్రోహం
Harish Rao: తెలంగాణ భవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన 'విజయ్ దివస్' వేడుకల్లో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: రేవంత్ అంటే వెన్నుపోటు.. రేవంత్ అంటే ద్రోహం
Harish Rao: తెలంగాణ భవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన 'విజయ్ దివస్' వేడుకల్లో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను గుర్తు చేస్తూ హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ అంటే పోరాటం.. కేసీఆర్ అంటే త్యాగం. కానీ, రేవంత్ అంటే వెన్నుపోటు.. రేవంత్ అంటే ద్రోహం అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, రేవంత్ రెడ్డి సృష్టించిన కొత్త విగ్రహాన్ని పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.
ఉద్యమంలో పుట్టిన తల్లి ఆశీర్వాదం, దీవెనలతో తెలంగాణ ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ తల్లిని మార్చే హక్కు రేవంత్‌కు ఎక్కడిది? రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ప్రజల తలరాతలు మారుస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఆయన చేసింది తెలంగాణ తల్లిని మార్చడమేనని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గెలిపిస్తే తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నారు. తలరాతలు మార్చలేదు కానీ, తెలంగాణ తల్లిని మార్చారు, అని విమర్శించారు.
చివరిగా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నందుకు గాను రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా హరీష్ రావు అభివర్ణించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.