కిరణా షాపు యజమాని పెద్ద మనసు.. ఆ ఒక్కరోజు ఫ్రీగా సరుకులు

కరోనా వైరస్ ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-03-31 16:25 GMT

కరోనా వైరస్ ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో కిరణా షాపులను, మెడికల్ షాపులు తప్ప అన్నింటిని క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో కొంద‌రు కిరాణా షాపు య‌జ‌మానులు ఉన్న ధరలకు మించి అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలా చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

ఇక ఇది ఇలా ఉంటే ఓ కిరాణా షాపు య‌జ‌మాని మాత్రం వినూత్నంగా అలోచించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకి అతను చేసింది ఏంటంటే లాక్ డౌన్ నేపధ్యంలో కనీస నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పేద వాళ్ళకి త‌న వంతు సాయంగా ఒక్క రోజు నిత్యవ‌స‌ర వ‌స్తువులు ఫ్రీగా ఇస్తాన‌ని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా కిరాణా షాపు ముందు ఓ బ్యాన‌ర్ క‌ట్టాడు. అందులో "లాక్ డౌన్ నేపధ్యంలో నిత్యావసర వస్తువల కొనుగోలు చేయటకు కూడా తగిన ధనం లేకా మన గ్రామంలో నివసిస్తూ రోజువారి కూలీ వేతనంపై ఆధారపడినా వలస కూలీలు రోజువారి భోజనాలకి ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను అందించుటకు సంకల్పించాం. ఏప్రిల్ 3 తేదిన మధ్యాహ్నం రెండు గంటలకు పైన తెలిపిన విధంగా ఉచ్చితంగా నిత్యావసర పంపిణీ చేయబడును" అంటూ పేర్కొన్నాడు.

ఆ యజమానిది హైదరాబాద్ శివారులోని..రంగారెడ్డి జిల్లా, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్, 6వ వార్డు గుర్రంగూడ. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ సదరు షాపు య‌జ‌మానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Tags:    

Similar News