గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ ఏర్పాటు

Update: 2019-09-19 10:04 GMT

గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్ ఏర్పాటుకు జీవో 48ను పంచాయతీరాజ్ శాఖ, మార్గదర్శకాల కోసం జీవో 50ని ప్రభుత్వం జారీ చేసింది. చైర్మన్ , ఇద్దరు సభ్యులతో ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. చైర్మన్, ఇతర సభ్యుల టర్మ్‌గా మూడేళ్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సవరణ చట్టం సెక్షన్ 37, సబ్ సెక్షన్ 6 ప్రకారం గ్రామ పంచాయతీల వివాదాల అప్పీల్‌ను విచారించి ట్రైబ్యునల్ తీర్పు చెప్పనుంది. 

Tags:    

Similar News