నిలోఫర్‌ ఆసుపత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌‎పై ప్రభుత్వం సీరియస్‌

నిలోఫర్‌ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులపై జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై వైద్యాధికారులు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నిలోఫర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ రవికుమార్‌‌ వివరణ ఇవ్వాలని కోరింది ప్రభుత్వం.

Update: 2019-09-30 05:42 GMT

నిలోఫర్‌ హాస్పిటల్‌లో అసలు ఎలాంటి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి, ఇప్పటి వరకూ ఎన్ని ట్రయల్స్‌ జరిగాయి అన్న విషయాలపై హెచ్‌ఓడీ రవికుమార్‌ను విచారించనుంది త్రిసభ్య కమిటీ. నిలోఫర్‌ హాస్పిటల్‌లో వైద్యం కోసం తమ చిన్నారులను తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అనుమతులు లేకుండా క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపితే ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News