ఇంద్రవెల్లిలో స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం
Indravelli: నెరవేరుతున్న గిరిజనుల చిరకాల స్వప్నం
ఇంద్రవెల్లిలో స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం
Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నం. ఎట్టకేలకు ఆ కల నెరవేరే క్షాణాలు ఆసన్నమయ్యాయి. కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంద్రవెల్లిని సందర్శించారు. స్థూపం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేసి గిరిజన పెద్దలతో సంప్రదింపులు జరిపారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి అమరులకు నివాళులు అర్పించారు.అనంతరం అక్కడే గిరిజన పెద్దలు, అధికారులతో స్మృతి వనం ఏర్పాటు గురించి చర్చించారు. స్మృతి వనం ఏర్పాటు అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేందుకు నివేదికను కూడా సిద్దం చేశారు.