GHMC Elections 2020: ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం: కేటీఆర్
* ప్రకృతి వైపరీత్యాలు లేని ప్రాంతం హైదరాబాద్ * పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం * కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు బాగున్నాయి * తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది * అత్యున్నత స్థాయికి హైదరాబాద్‌ను తీసుకెళ్లడమే మా లక్ష్యం
KTR in election campaign
ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరమని అన్నారు మంత్రి కేటీఆర్. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రకృతి వైపరీత్యాలు లేని సురక్షితమైన ప్రాంతం హైదరాబాద్ అని కొనియాడారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని.. కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు బాగున్నాయని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్న ఆయన.. గత ఐదేళ్లలో ఐటీ పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని.. గూగుల్, అమెజాన్, యాపిల్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయికి హైదరాబాద్‌ను తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు.