మరో పరిశ్రమలో గ్యాస్ లీక్ కలకలం..

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2020-05-11 08:10 GMT

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. పేపర్ 1, 2. ఫ్లాట్లకు వెళుతున్న క్లోరిన్ లీకయ్యే సమయంలో 20 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. గ్యాస్‌ లీక్‌ ఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటహుటిన సమీపంలోని‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి‌ తరలించారు.

ఈ ఘటన బయటకు రాకుండా ఆ పరిశ్రమ యాజమాన్యం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ అస్వస్థతకు గరైన కార్మికుడిని వైద్యులు ఆయనను ప్రశ్నించడంతో ఆ విషయం బయటపడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం ఆ కార్మికుడి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం. క్లోరిన్ గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. లాక్ డౌన్ కావడంతో పూర్తి స్థాయిలో బాయిలర్స్ వినియోగంలో లేకపోవడం పేపర్ బ్రైట్ నెస్ పెంచేందుకు వినియోగించే క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటన మరవకముందే ఇటువంటి ఘటనలే పలు చోట్ల వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


Tags:    

Similar News