Vikarabad: తాండూరులో గంజాయి మొక్కల కలకలం
Vikarabad: వికారాబాద్ జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి.
Vikarabad: తాండూరులో గంజాయి మొక్కల కలకలం
Vikarabad: వికారాబాద్ జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి. తాండూరులో ఓ వ్యక్తి తన పొలంలో గంజాయి మొక్కలు పండిస్తున్నట్లు సమాచారం అందడంతో డీటీఎఫ్, SHO తాండూర్ టీం మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. కోట్పల్లి మండలం బార్వాద్‌లో పెంటయ్య అనే వ్యక్తి తన ఇంటి దగ్గర గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీలు చేసి నిందితుడి దగ్గర గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.