Ganja Chocolates: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం
Ganja Chocolates: కిరణాషాపు ద్వారా ఇండస్ట్రీయల్ ఏరియాల్లో చాకెట్ల విక్రయం
Ganja Chocolates: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం
Ganja Chocolates: హైదరాబాద్ రామంతాపూర్‌లో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. రామంతపూర్ గాంధీ నగర్ లో భారీగా గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్ జేన అనే వ్యక్తి అరెస్ట్ చేసి 34 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. గాంధీ నగర్ లో కిరాణం షాప్ నడుపుతున్న ఫిరోజ్ జేన ఉప్పల్ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు అమ్ముతున్నాడు. రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జేన కిరణం షాప్ లోనూ, ఇంటిపై తనిఖీలు చేయగా...34 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి.