కరోనాపై ఆరాతీస్తే మరేదో బయటపడింది.. డాక్టర్ వసంత్ సంచలన ఆడియో టేప్..

Update: 2020-02-13 11:42 GMT
డాక్టర్ వసంత్

తీగ లాగితే డొంక కదిలినట్లు గాంధీఆస్పత్రి డాక్టర్ వసంత్ పై సస్పెన్షన్ వేటు ఆ ఆస్పత్రిలో అక్రమాల పుట్టను తవ్వి తీసినట్లయింది. గాంధీలో లంచాల బాగోతంపై ఒకవైపు వసంత్, మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు.

డాక్టర్ వసంత్ ఆరోపణలపై గాంధీ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసంత్ స్టూడెంట్స్ వద్ద డబ్బుల కోసం మాట్లాడిన ఆడియోను గాంధీ వైద్యులు రిలీజ్ చేశారు. గాంధీ ఆసుపత్రి వసంత్ అక్రమాలపై వీడియో కూడా రిలీజ్ చేశారు. వసంత్‌ ఆరోపణలు నిరాధారమైనవన్నారు సూపరింటెండెంట్‌ శ్రావణ్‌.

ఆయన ఆరోపణలు పట్టించుకోవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. గాంధీ పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. మందుల దుకాణాలు, క్వాంటీన్ల నుంచి వసంత్‌ డబ్బు డిమాండ్‌ చేశారని.. వారి దగ్గర ఉన్న ఆధారాలతో వసంత్‌పై ఫిర్యాదు చేశారన్నారు.


Full View


Tags:    

Similar News