Gampa Govardhan: రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి.. సెప్టెంబర్ 17న తెలంగాణ పరివర్తన చెందింది
Gampa Govardhan: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన గంప గోవర్ధన్
Gampa Govardhan: రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి.. సెప్టెంబర్ 17న తెలంగాణ పరివర్తన చెందింది
Gampa Govardhan: రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి సెప్టెంబర్ 17న తెలంగాణ పరివర్తన చెందిందని.. అందుకు పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందన్నారు .వారి త్యాగాలను స్మరించుకోవడంతోపాటు నేటి యువతరానికి చరిత్రను తెలియజేయాలన్నారు.