కరోనాతో మరణించిన వృద్దుడి అంత్యక్రియలు పూర్తి

తెలంగాణలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్ని రంగాలను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

Update: 2020-03-30 11:25 GMT
Representational Image

తెలంగాణలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్ని రంగాలను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది.అందరూ ఉన్నా అతని చివరి మజిలీకి ఎవరూ రాకపోవడంతో ఓ అనాథ శవంలాగా హెల్త్‌ వర్కర్లు దగ్గరుండి అతని అంత్యక్రియలు నిర్వహించారు.

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందిన మొదటి వ్యక్తి 74 ఏళ్ల వృద్దుడు. కాగా అతని మరణ వార్తను అయినవారికి సమాచారం ఇచ్చినప్పటికీ బంధువులు ఎవరూ హాజరు కాలేదు. ప్రస్తుత సమయంలో గుంపులుగా ఉంటేనే కరోనా వ్యాపిస్తుందేమో అన్న భయంతో ప్రజలు ఉన్నారు. కానీ ఈ వృద్దుడు కరోనా కారణంగా చనిపోయాడు అని తెలియగానే మృత దేహాన్ని చివరిసారి చూడటానికి ఐన వాల్లు, బంధువులు ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేదు. దీంతో హెల్త్‌ వర్కర్లు దగ్గరుండి అతని చేసారు.

ఈ నెల 14వ తేదీన ఈ వృద్దుడు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాడు. తిరగి 17న వచ్చారు. సరిగ్గా మూడు రోజుల తరువాత అంటే 20వ తేదీన అతను శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా అతని పరిస్థితి విషమించడంతో గత గురువారం రాత్రి అతను చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ సూచనల మేరకు సైఫాబాద్‌ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇక మృతి చెందిన వృద్దుని రక్త నమూనాలను పరిశీంచగా అతనికి కరోనా సోకిందని అతను చనిపోయిన తరువాత రిపోర్టుల వచ్చాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను ప్రస్తుతం ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచడంతోపాటూ వృద్దుడి అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించారు.

Tags:    

Similar News