నరహంతకుల్లా మారుతున్న స్నేహితులు.. మొన్న నవీన్.. ఇప్పుడు వినయ్..
Friends: ప్రాణస్నేహితులే నరహంతకుల్లా మారుతున్నారు.
నరహంతకుల్లా మారుతున్న స్నేహితులు.. మొన్న నవీన్.. ఇప్పుడు వినయ్..
Friends: ప్రాణస్నేహితులే నరహంతకుల్లా మారుతున్నారు. అప్పటిదాకా స్నేహగీతం ఆలపించిన మిత్రులే విషం కక్కుతున్నారు. పీకల దాకా ద్వేషం పెట్టుకుని పైకి మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ నమ్మిన స్నేహితులను కడతేరుస్తున్నారు. తమ స్వార్థాల కోసం నమ్మిన స్నేహితులను బలి తీసుకుంటున్నారు. మొన్న నవీన్, నేడు వినయ్.. ఇలా స్నేహితుల చేతుల్లో బలైన వారే. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
ఇటీవల స్నేహితుని చేతిలో దారుణ హత్యకు నవీన్ ఘటన మరువక ముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. వినయ్ అనే యువకుడిని స్నేహితులే హతమార్చారు. రెండ్రోజులుగా వినయ్ అనే యువకుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టగా పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. స్నేహితుల చేతుల్లోనే ఆ యువకుడు హత్యకు గురయ్యాడని పోలీసులు గుర్తించారు.
కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూరారంలోని జ్యోతి మిల్క్ వెనకాల నిర్మానుష్య ప్రదేశంలో వినయ్ అనే యువకుడు దారుణంగా హతమార్చారు. రెండ్రోజులుగా వినయ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయి సేవించి స్నేహితులే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.