Hyderabad: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్ల వసూళ్లు

Hyderabad: నెలకు 35వేలు ఇస్తామంటూ రూ.3.2 లక్షలు వసూలు

Update: 2024-01-30 06:13 GMT

Hyderabad: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్ల వసూళ్లు

Hyderabad:  హైదరాబాద్‌లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. యూట్యాూబ్‌లో యాడ్స్‌, ఫ్రాంచైజీలతో ఆఫర్స్‌ అంటూ అమాయకులను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. నెలకు 35 వేల రూపాయల జీతం ఇస్తామంటూ 3 కోట్లు తీసుకుని ఉడాయించారు. అడ్రస్ లేకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన దంపతులు సమీనా, ఇస్మాయిల్‌ మోసాలనే పనిగా పెట్టుకున్నారు. గతంలో కూడా చిట్‌ఫండ్స్ పేరుతో వీరిద్దరూ మోసాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలతో ఉడాయించారు. తాజాగా బ్యూటీ పార్లర్ పేరుతో కొత్త మోసానికి తెరతీశారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూళ్లు చేసి మాయమయ్యారు.

బ్యూటీ పార్లర్‌ ఫ్రాంచైజీ అంటూ వందకి పైగా పార్లర్లు ఓపెన్ చేశారు సమీనా, ఇస్మాయి. సమీనా చెల్లితో కలిసి యూట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించారు. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలు వసూలు చేశారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35 వేలు జీతం ఇస్తామని నమ్మించారు. 2,3 నెలల పాటు జీతం ఇచ్చి ఆ తర్వాత రేపు మాపు అంటూ కాలం వెళ్లదీశారు. ఆ తర్వాత నిందితుల నుంచి రెస్పాన్స్ ఆగిపోయింది.

జీతాల కోసం డబ్బులు కట్టిన బాధితులు కాల్ చేస్తే ఫోన్లు స్విచాఫ్‌ అయ్యాయి. దాంతో బాధితులంతా కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌ హెడ్ ఆఫీస్‌కు వెల్లారు. అయితే అక్కడ ఆఫీస్‌కు తాళం వేయడంతో తాము మోసపోయామని గ్రహించారు బాధితులు. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కిలాడీ జంట చేసిన మోసాల బారిన పడిన వారిలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన వందల మంది బాధితులు ఉన్నారు. కేటుగాళ్ల మాయమాటలు నమ్మి మంగళసూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీ తీసుకున్నామని చెబుతున్నారు బాధితులు. 

Tags:    

Similar News