జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం
JayaShankar Bhupalpally: కాలేశ్వరం గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం
JayaShankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం గ్రామం అటవీ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో చేపలు ప్రత్యక్షమవడంతో కాళేశ్వరం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో చేపలు ప్రత్యక్ష్యం కావడంతో అటుగా వెళ్తున్న ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలకు చేపలు కనబడ్డాయి. దీంతో చేపలను పట్టుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర మండలం కాలేశ్వరం గ్రామంలో చేపల వర్షం పడింది. ఆదివారం కురిసిన వర్షానికి అటవీ ప్రాంతంలో చేపలు ప్రత్యక్షమయ్యాయి. ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనబడటంతో... చేపలను పట్టుకునేందుకు ఎగబడ్డారు. ఇప్పటివరకు ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదని ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో అని ఆశ్చర్యానికి గురవుతున్నారు ఉపాధిహామీ కూలీలు.
ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా చేపలు ప్రత్యక్షమవడం స్థానికులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఇక్కడ ఎప్పుడు చేపలు ఉన్న ఆనవాళ్లు లేవని గ్రామస్తులు అంటున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చేపలు ఇక్కడకు వచ్చాయని ప్రచారం జరగడంతో చేపలను చూసేందుకు పొరుగు గ్రామాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తున్నారు.
ఇప్పటివరకు వర్షానికి చేపలు కురుస్తాయని వినడమే కానీ చూసింది లేదు. ఇప్పుడు స్వయానా తమ గ్రామంలోనే రాత్రికిరాత్రి చేపలు ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.