Hyderabad: అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
Hyderabad: అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
Hyderabad: అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
Ankura Hospital: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆస్పత్రితో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.