ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట రైతు ఆత్మహత్య

ప్రతి ఏటా ఎంతో మంది రైతులు ఏదో ఒక కారణం చేత ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. కొంత మంది పంటను నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొంత మంది రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు జరగకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Update: 2020-06-20 07:27 GMT

ప్రతి ఏటా ఎంతో మంది రైతులు ఏదో ఒక కారణం చేత ఆత్మహత్య లకు పాల్పడుతూ ఉంటారు. కొంత మంది పంటను నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొంత మంది రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు జరగకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది రైతులు తమ భూముల సమస్యలను తీర్చాలంటూ చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అయినా అధికారులు రైతులను పట్టించుకోకుండా వారి సమస్యలను పరిష్కరించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లాలోనూ చోటుచేసుకుంది. అధికారులు తన సమస్యను పరిష్కరించడం లేదంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన రాజిరెడ్డి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా వెంటనే పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అనంతరం రైతు రాజిరెడ్డి మృత‌దేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా రైతు ఆత్యహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్‌లో ఎమ్మార్వో వేణుగోపాల్, వీఆర్వోలు గురు ముర్తి, స్వామిలు కారణం అని రాసినట్టు సమాచారం. దీన్ని బట్టిపరిశీలిస్తే భూమి ఆన్‌లైన్ విషయంలో మనస్తాపం చెంది రైతు రాజిరెడ్డి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై ఇప్పటి వరకు బాధితుడి కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారులు స్పందించలేదు. రైతు ఇలా తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రాణాలు తీసుకోవడం కలకలంరేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News