మీడియా కూడా కోవిడ్ వారియర్సే : ఎంపీ బండి సంజయ్

మీడియా కూడా కోవిడ్ వారియర్సే : ఎంపీ బండి సంజయ్
x
bandy sanjay(file photo)
Highlights

కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న రిపోర్టర్లను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న రిపోర్టర్లను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నిన్న డాక్టర్లు.. నేడు రిపోర్టర్లు.. రాష్ట్రంలో కరోనా వైరస్ తాలూకు పరిస్థితులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. జర్నలిస్టులని ప్రత్యేక దృష్టితో చూసి వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనామొద్దు నిద్ర వీడి కరోనా కట్టడిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టర్‌ కరోనా వైరస్ సోకి మరణించడం తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. ఇది చాలా బాధకరమైన విషయం అని చెప్పారు. రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులందరికీ ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ యుద్ధ ప్రాతిపదికన కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించి వారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో కరోనా వైరస్‌పై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసిన మీడియా సైతం కోవిడ్ వారియర్సేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories