Hyderabad: నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు
Hyderabad: 2 రోజుల వ్యవధిలో మూడు నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు
Hyderabad: నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు
Hyderabad: కిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు చేశారు. రెండు రోజుల వ్యవధిలో మూడు నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు పోలీసులు. కూకట్‌పల్లి, పేట్‌బషీర్‌బాద్‌లో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల సోదాలు నిర్వహించారు. అనూ ఫ్రోజెన్ ఫుడ్స్ పేరుతో నకిలీ ఐస్‌క్రీమ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉత్పత్తుల తయారు చేస్తున్న రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హానీ కలిగించేలా ఉన్న 15 లక్షల రూపాయల విలువైన ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఐస్‌క్రీమ్‌లపై ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.