సిటీలో పేలుడు కలకలం

Update: 2019-11-08 06:23 GMT

హైదరాబాద్ లోని మీర్ పేటలో కలకలం రేగింది. చెత్తకుప్ప వద్ద పేలుడు సంభవించింది. విజయపురి కాలనీలోని చెత్త కుప్ప వద్ద ఓ మహిళ చెత్త ఏరుకుంటుంది. చెత్తకుప్పలో దొరికిన ఓ డబ్బాను నేలకొసి కొట్టగా, భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. చెత్త ఏరుకునే మహిళకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని డబ్బాను స్వాధీనం చేసుకుని క్లూస్‌ టీమ్‌కు అప్పగించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News