TS Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

TS Secretariat: మధ్యాహ్నం 12.30కి సెక్రటేరియట్‌ చేరుకోనున్న సీఎం కేసీఆర్

Update: 2023-04-30 02:10 GMT

TS Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

TS Secretariat: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు సచివాలయంలో సుదర్శన యాగంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఈ యాగంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 12 తరువాత సచివాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు చేరుకోనున్నారు. 12 గంటల 30 నిమిషాల తరువాత సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోనున్నారు. మొదట యాగం సందర్భంగా పూర్ణాహుతిలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలోని ఆరో అంతస్తుకి వెళతారు. సీఎం ఛైర్ లో ఆసీనులు కాగానే ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల ఆర్ధిక సాయానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయనున్నారు సీఎం. అనంతరం సీతారామ ప్రాజెక్టు, ఇరిగేషన్ శాఖలపై రివ్యూ చేస్తారు.. అక్కడి నుంచి సచివాలయంలో ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనంలో సచివాలయాన్ని కలియ తిరుగుతారు సీఎం కేసీఆర్. సీఎం సీట్లో కూర్చోగానే సీఎం కేసీఆర్ కి మంత్రులు పుష్పగుచ్ఛాలు ఇస్తారు. అనంతరం మంత్రులు తమ ఛాంబర్లకి వెళ్లి ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతారు. 

Tags:    

Similar News