Etela Rajender: బీజేపీకి గుడ్ బై.. ఈటల రియాక్షన్ ఇదే..!
Etela Rajender: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఈటల
Etela Rajender: మోడీ, నడ్డా నేతృత్వంలో సైనికుడిలా పనిచేస్తున్నా
Etela Rajender: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ నేత ఈటల రాజేందర్ ఖండించారు. మోడీ,నడ్డా నేతృత్వంలో సైనికుడిలా పనిచేస్తున్నట్లు తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతమొందిచడమే తన లక్ష్యమన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి భేదాప్రాయాలు లేవన్నారు. పార్టీ మార్పుపై పత్రికల్లో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.