ఈఎస్ఐ స్కామ్‌లో వెలుగుచూస్తున్న కొత్త కోణాలు
-ESI స్కామ్‌లో వెలుగుచూస్తున్న కొత్త కోణాలు -చెర్లపల్లి డిస్పెన్సరీ నుంచి పెద్ద మొత్తంలో మందుల కొనుగోలు -2015 - 2019 మధ్య భారీగా కొనుగోళ్లు -మందులు సరఫరా చేసిన 5 ఫార్మా కంపెనీలపై ఫోకస్ -భాస్కర ఏజెన్సీ, క్రిష్టల్ ఎంటర్‌ప్రైజెస్, శ్రీ సంతోష్, గరుడు, లక్ష్మీ ఫార్మాలపై విచారణ -రూ. 2 ట్యాబ్‌లెట్స్‌ను రూ. 12 రూపాయలకు కొనుగోలు చేసినట్లు గుర్తింపు -ఈఎస్‌ఐకు చెందిన 12 మంది ఫార్మాసిస్టులపై విచారణ -నిందితుల కస్టడీపై రేపు విచారణ చేయనున్న ప్రత్యేక న్యాయస్థానం -సోమవారం మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం
ఈఎస్ఐ స్కామ్ లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. 2015 నుంచి 2019 మధ్య చెర్లపల్లి డిస్పెన్సరీ నుంచి పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. మెడికల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ దేవికారాణిని అడ్డుకుపెట్టుకుని ఫార్మాసిస్టులు అందిన కాడికి దోచుకున్నట్లు తెలుస్తోంది. 5 కంపెనీల నుంచే మందులను కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు 14 మెడిసన్స్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీంతో మందులను సరఫరా చేసిన ఐదు ఫార్మా కంపెనీలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో రేపు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.