Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి
Bandi Sanjay: కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి
Bandi Sanjay: హన్మకొండ జిల్లా వంగరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాహిత యాత్ర చేపడుతున్న బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలే తమపై గుడ్లతో దాడి చేశారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.
పోలీసుల భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్... దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. దాడి చేస్తున్న వ్యక్తులను నిలువరించకపోవడమేంటని నిలదీశారు. మీ భద్రత అక్కర్లేదు... వెళ్లిపోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.