Hyderabad: హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న నాలాలు

Hyderabad: * కొన్నిరోజుల వ్యవధిలోనే ఆరు ఘటనలు * భారీ వర్షాలకు నాలాల్లో తేలుతున్న మృతదేహాలు

Update: 2021-10-01 09:13 GMT

Hyderabad:భారీ వర్షాలకు నాలాల్లో తేలుతున్న మృతదేహాలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు నాలాలు నరకాన్ని చూపిస్తున్నాయి. భారీ వర్షాలకు నాలాల్లో మృతదేహాలు తేలాడుతున్నాయి. మృతదేహాలు ఎవరిదనేది కూడా తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆరు ఘటనలు చోటుచేసుకోవడంతో భాగ్యనగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం కుత్బుల్లాపూర్‌లో మోహన్‌రెడ్డి గల్లంతయ్యారు. మూడ్రోజుల క్రితం మణికొండలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రజనీకాంత్ కొట్టుకుపోగా కొన్ని గంటలు కష్టపడితే బాడీ దొరికింది.

ఇక ఈ నెల 28న ముసారంబాగ్‌లో మూసీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి డెడ్‌బాడీ కొట్టుకొచ్చింది. నిన్న జియాగూడలో ఈతకు వెళ్లి శ్రీనివాస్‌ గల్లంతయ్యాడు. ఇవాళ ఉదయం చాదర్‌ఘాట్‌లో కాల కృత్యాల కోసం వెళ్లి జహంగీర్‌ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. ఫోక్స్‌ సాగర్‌లో మూడ్రోజుల క్రితం మరో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఇక రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌, జహంగీర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

Tags:    

Similar News