త్వరలోనే బతుకమ్మ చీరల పంపిణీ : కేటీఆర్

ఈ నెల 23వ తేదీ నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీర ప్రదర్శనను ఆయన సందర్శించారు.

Update: 2019-09-19 11:33 GMT

ఈ నెల 23వ తేదీ నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీర ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా మాట్లాడుతూ... 24 వేల పైచిలుకు మగ్గాలు పనిచేసి 100 డిజైన్లతో కోటి చీరలు జిల్లాలకు సరఫరా చేసి 23వ తేదీ నుంచి పంపిణీకి అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. బతుకమ్మ చీరలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసిందని..నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.  

Tags:    

Similar News