బంగాళాఖాతంలో వాయుగుండం..24 గంటల్లో..

Update: 2019-08-07 02:06 GMT

నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మంగళవారానికి వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురువారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువవచ్చన్నారు.

Tags:    

Similar News