High Court: డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ

High Court: హైకోర్టు విచారణకు హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌

Update: 2023-07-13 10:46 GMT

High Court: డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ

High Court: డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరయ్యారు. లోకేశ్ కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు అభిప్రాయ పడింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించింది.

ఆదివారం నాడు హోటల్‌ను ఎందుకు కూల్చాల్సి వచ్చిందో చెప్పాలని పేర్కొంది. హోటల్‌ కూల్చివేత సమయంలో తీసిన వీడియో, ఫోటోలను సమర్పించాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో కేసు విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. 

Tags:    

Similar News