Sangareddy: అగ్నికి ఆహుతైన డీసీఎం వాహనం
Sangareddy: మంటలు వ్యాపించి మరో కారు దగ్ధం
Sangareddy: అగ్నికి ఆహుతైన డీసీఎం వాహనం
Sangareddy: డీసీఎం వాహనం లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న కారు కాలిపోయింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భీరంగుడ కమాన్ సమీపంలో జాతీయ రహదారి పై రసాయనాలతో నిండిన డ్రమ్ములు తీసుకెళ్తున్న డిసిఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో డీసీఎం అగ్నికి ఆహుతయింది. పక్కనే వున్న మరో కారు కు మంటలు వ్యాపించడం తో కారు కూడా కాలిపోయింది. విషయం గ్రహించిన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని పక్కకు అపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి కావడం తో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.